22వ సినిమాలో రామ్ ఫస్ట్ లుక్….ఫ్యాన్స్‌కు పండగే!”

Ram's first look in the 22nd movie....a feast for fans!"
Ram's first look in the 22nd movie....a feast for fans!"

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ “డబుల్ ఇస్మార్ట్” తో ఈ ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో రామ్ కం బ్యాక్ కోసం ఇపుడు తన ఫ్యాన్స్ ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత తాను తన కెరీర్ 22వ సినిమా దర్శకుడు మహేష్ తో అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

Ram's first look in the 22nd movie....a feast for fans!"
Ram’s first look in the 22nd movie….a feast for fans!”

“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” తో సాలిడ్ డెబ్యూ అందుకున్న ఈ యువ దర్శకుడు కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మరి దీని నుంచి రామ్ పై లేటెస్ట్ గా ఒక సూపర్ కూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా లో రామ్ సాగర్ అనే పాత్రలో నటిస్తుండగా ఒక సైకిల్, దానితో ఒక సింపుల్ లుక్ లో రామ్ జోవియల్ గా కనిపిస్తున్నారు . మరి ఈ సాగర్ మీలో ఒకడు అంటూ పోస్ట్ చేశారు. మరి ఈ మూవీ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ కి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.