రానా అనారోగ్యం గురించి రెగ్యులర్ గా రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. రానా ముంబైలో స్థిరపడతారని ఓ ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదంతా అటుంచితే.. రానా పై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసిన కథనం తన మనసును గాయపరిచిందట. అతడు సదరు పత్రిక పై సామాజిక మాధ్యమాల వేదికగా మండి పడ్డారు.
రానా ఫిజిక్ మెయింటెనెన్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా ఎక్కువ. బాలీవుడ్ మల్టీస్టారర్ `హౌస్ ఫుల్ 4` చిత్రీకరణ లో పాల్గొనేందుకు లండన్ వెళ్లినప్పుడు తన తో పాటే పర్సనల్ చెఫ్ ని వంట కోసం అక్కడికి తీసుకెళ్లారని.. తను అంత జాగ్రత్తపరుడు అని రాశారు. దానిని ట్విట్టర్ లోనూ పోస్ట్ చేసింది సదరు సంస్థ. అయితే ఇలాంటి నిరాధార వార్తల్ని ఎలా రాస్తారు? అంటూ రానా ట్విట్టర్ లో ప్రశ్నించారు.
అసలు లండన్ షెడ్యూల్ లోనే పాల్గొనలేదు. అలాంటిది చెఫ్ ని తీసుకెళ్లానని ఎలా రాస్తారు? అంటూ సీరియస్ అయ్యారు.ఆ కథనం పై రానా సీరియస్ అవ్వగానే ఆ ట్వీట్ ని వెంటనే తొలగించారు. సినీసెలబ్రిటీల పై ఇలాంటి గాసిప్స్ మామూలే కానీ.. కొన్నిసార్లు అవే సీరియస్ అవుతున్న సన్నివేశం ఉంది. జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న పత్రికలు అలా రాసేస్తే సెలబ్రిటీలు సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు.