Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానా, త్రిషల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే మా ఇద్దరి మద్య ఎలాంటి వ్యవహారం లేదు అంటూ ఇద్దరు పదే పదే చెబుతూనే ఉన్నారు. త్రిష పెళ్లి నిశ్చితార్థం అవ్వడం, ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వడంకు కారణం రానానే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయిన నేపథ్యంలో ఇద్దరు డీప్ లవ్‌లో ఉన్నారనే చర్చ జరిగింది. తాజాగా ఈ విషయమై మరోసారి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి.
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో రానా తెలుగులో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాను తమిళనాట విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో రానా పాల్గొంటున్నాడు. రానా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ సందర్బంగా త్రిషతో మీరు సినిమా చేసే ఛాన్స్ ఉందా, అది ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రశ్నించాడు ఒక అభిమాని, అందుకు సమాధానంగా ఆ ప్రశ్నకు సమాధానం త్రిష చెప్పాలని, ఆమెతో నటించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. త్రిష ఒప్పుకుంటే ఈయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా ఉంది. త్రిష పట్ల అంత సానుకూల వైఖరితో ఈయన ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇద్దరి మద్య వ్యవహారం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషయమై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.