దగ్గుబాటి హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదని చెప్పుకోవాలి . ఇక దాదాపు ఈయన నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇది ఇలా ఉండగా, దర్శకుడు తేజతో హీరో రానా దగ్గుబాటి మరోసారి చేతులు కలిపారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా ”నేనే రాజు నేనే మంత్రి” రాగా….. ఇప్పుడు రెండోసారి ఒక గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు “రాక్షసరాజా” అని టైటిల్ పెట్టారు. రానా ఈరోజు తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతను నెక్స్ట్ మూవీ ‘రాక్షసరాజా’ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఫస్ట్ లుక్, పోస్టర్ కూడా విడుదల చేశారు.