రానా దగ్గుబాటి కిడ్నీ సమస్యతో బాధ పడుతూ కొంతకాలంగా అమెరికాలో చికిత్స తీసుకుంటోన్న రానా ఇంకా కోలుకోలేదు. ఈ పాటికే రానా తిరిగి వచ్చేస్తాడని నిర్మాతలకి సురేష్ బాబు హామీ ఇచ్చారు. కానీ మరో నెల రోజులు పైగానే అక్కడ వుండాలనేది తాజా సమాచారం. దీంతో అతని కోసమే ఆగిపోయి వున్న సినిమాలకి వడ్డీ భారం పెరుగుతోంది.
విరాఠ పర్వం చిత్రాన్ని రానా భాగం మినహాయించి షూటింగ్ చేసేసారు. రానా వస్తే కానీ ఆ మిగతా భాగం పూర్తి చేయలేరు. సెప్టెంబర్‌లోనే వచ్చి షూటింగ్ చేస్తానని చెప్పిన రానా నవంబర్‌కి కూడా వచ్చేలా లేడు. పైగా బక్కచిక్కిపోయిన రానా ఈ వ్యాధి నుంచి కోలుకుని పూర్తి గ్లామర్‌తో ఎప్పుడు సిద్ధమవుతాడనేది తెలియడం లేదు.
ఒకవేళ నవంబరులో వచ్చినా కానీ కెమెరా ముందుకి వచ్చేలా రానా వుంటాడా అనేది అనుమానమే.చూస్తోంటే కనీసం మూడు, నాలుగు నెలల పాటయినా రానా షూటింగ్స్‌కి దూరంగా వుండేలా వున్నాడు. అది తనతో సినిమాలు తలపెట్టిన నిర్మాతలకి పెను భారమే అవుతుంది