లాక్‌డౌన్ వేళ సెలబ్స్ లవ్ లాక్ లు ఒక్కొక్కటి ఓపన్ అవుతున్నాయి. తాజాగా తన లవ్ లాక్ ఓపనైందోచ్ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు రానా దగ్గుబాటి. డిజైనర్ మిహీకా బజాజ్ తన ప్రేమకి ఓకే చెప్పిందని ఆమెతో కలిసి దిగిన ఫోటోని రానా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో సెలబ్రిటీలంతా ఆయనకు శుభాకాంక్షలు అందించారు. అభిమానులు మిహీకాపై ఆరాలు తీయడం మొదలు పెట్టారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మిహీక… బంటీ, సురేష్ బజాజ్ దంపతుల గారాలపట్టి. మిహీకా చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమె ఇంటీరియర్ డిజైన్ .. డెకార్ బిజినెస్ స్పెషలిస్ట్. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను మిహీక స్వయంగా నడుపుతున్నారు.
ముఖ్యంగా ఈ సంస్థ వివాహాలు.. ఇతర కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తుంది. అతి త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా రానా-మిహీకాకి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు నవ్వుతూ ఫోటోలకి ఫోజిలివ్వడంతో అభిమానులు ఫోటోను వైరల్ చేస్తున్నారు.