దగ్గుబాటి హీరో రానా గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. రానా అనారోగ్యం గురించిన వార్తలు తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయి. మీడియాలో వస్తున్న వార్తలను రానా మరియు సురేష్‌బాబు పలు సందర్బాల్లో కొట్టి వేస్తూ వచ్చారు. తనకు అంతా బాగానే ఉందని, అయితే ఒక కన్నుకు ఆపరేషన్ జరగాల్సి ఉంది అంటూ చెబుతూ వచ్చాడు. ఆరోగ్యం అంతా బాగానే ఉన్నా కూడా రానా ఎందుకు సినిమాలు చేయడం లేదు, సినిమాలకు దూరంగా ఎందుకు ఉంటున్నాడు, టైం ఎందుకు తీసుకుంటున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే రానా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు.
తాజాగా వెంకటేష్, నాగచైతన్యల మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కారణంగా షూటింగ్ ప్రారంభోత్సవంలో రానా కూడా కనిపించాడు. అయితే రానా మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. ఫొటోల్లో కనిపించకుండా, ఫొటోలకు దూరంగా ఉంటూ వచ్చాడు. షూటింగ్ ప్రారంభం సమయంలో రానా లాంగ్ షాట్లో ఒక ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు, అంతే తప్ప క్లోజ్అప్లో ఫొటోలకు నో చెప్పాడు. కారణం రానా చాలా అంటే చాలా బక్కగా అయ్యాడు. ‘లీడర్’ సమయంలో రానా ఎలా ఉండేవాడో అంతకంటే బక్కగా అయ్యాడు. బాహుబలి కోసం దాదాపు వంద కేజీల బరువు పెరిగిన రానా, ప్రస్తుతం 65కి కాస్త అటు ఇటుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంత బరువు తగ్గడంతో రానా చాలా సన్నగా పీలగా కనిపిస్తున్నాడు. గత రెండు నెలలుగా రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ కారణంగానే ఇలా బక్కగా అయ్యాడు అనే టాక్ వినిపిస్తుంది. రానా అనారోగ్యం ఏంటీ అనేది ఇప్పటికైనా దగ్గుబాటి ఫ్యామిలీ వెళ్లడిచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రానా మునుపటి రూపంలోకి రావాలని, భల్లాలదేవుడిగా కనిపించాలంటూ ఆయన సన్నిహితులు మరియు ఫ్యాన్స్ దేవుడిని ప్రార్థిస్తున్నారు.