సోనమ్, దుల్కర్‌కు క్షమాపణలు చెప్పిన రానా.. నెగిటివిటీని తట్టుకోలేకపోతున్నాను..?

Rana Daggubati
Rana Daggubati

టాలీవుడ్ హీరో రానా తాజాగా నటి సోనమ్ కపూర్ కి క్షమాపణలు తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాటిపై స్పందిస్తూ ఆమెకు క్షమాపణలు తెలుపుతూ ట్వీట్ చేశారు రానా.దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.ఈ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు.దుల్కర్ సల్మాన్ మా యాక్టింగ్ స్కూల్‌లో నాకు జూనియర్.ఎందుకు అయన పద్దతైన మనిషి అని పదే పదే చెపుతున్నా మంటే ఆయనొక హిందీ సినిమా చేస్తున్నారు.ఆ సినిమా నిర్మాతలు నాకు స్నేహితులు.మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంది, కాబట్టి ఆదివారం పూట నేను వెళ్లాను.కేరళ నుంచి వచ్చిన అయన స్పాట్ బాయ్, ఆయన కలిసి ఒక కార్నర్‌లో ఉన్నారు.ఒక పెద్ద హిందీ సినిమా హీరోయిన్ ఆ సినిమాలో చేస్తోంది.

ఒకవైపు టేక్ జరుగుతోంది.ఆవిడ భర్తతో ఫోన్‌లో మాట్లాడుతోంది.ఈయన మాత్రం ఆ ఎండలో అక్కడే నిలబడి ఉన్నాడు.సరే ఫోన్ అయిపోయాక టేక్ చేయడానికి వెళ్తుందేమో అనుకుంటే నాతో పరిచయ కార్యక్రమం పెట్టింది.టేక్ రెడీగా ఉంది వెళ్లమని చెప్పాను.డైలాగులు మరిచిపోతోంది.మధ్యలో మళ్లీ ఏదో ఫోన్ మాట్లాడింది.దీంతో నాకు కోపం వచ్చి వాటర్ బాటిల్ నేలకేసి కొట్టేశా.

ఈ వ్యక్తి మాత్రం అంతే కామ్‌గా నిలబడి, ఆమె ఎన్ని టేక్‌లు చేస్తే అన్ని టేకులు చేసుకుంటూ, ప్యాకప్ అయిపోయాక అడవిలో ఆవిడ స్టాఫ్ మూడు నాలుగు కార్లలో వెళ్తే, మావాడు చిన్న ఇన్నోవా కారులో ఆయన అసిస్టెంట్‌తో వెళ్లాడు.ఆ తరవాత నేను సెట్‌లో నిర్మాతలను ఒక అరగంటపాటు తిట్టి బయలుదేరాను అని రానా చెప్పుకొచ్చారు.అయితే నిజానికి ఆ స్పీచ్‌లో రానా.సోనమ్ కపూర్పేరు చెప్పలేదు.కానీ, ఇవ్వాల్సిన క్లూస్ అన్నీ ఇచ్చేయడంతో జనాలు గుర్తుపట్టేశారు.దీంతో సోషల్ మీడియాలో సోనమ్ కపూర్‌పై నెగిటివిటీ మొదలైంది.

ఆమెను ట్రోల్ చేస్తూ, తిట్టి పోస్తూ ట్విట్టర్‌లో రచ్చ రచ్చ అయ్యింది.సోనమ్ కపూర్ హ్యాష్‌ట్యాగ్ట్రెం డ్ అయ్యింది.దాంతో రానా ట్విట్టర్ వేదికగా స్పందించారు.నా వ్యాఖ్యల కారణంగా సోనమ్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తోన్న నెగిటివిటినీ నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను.నేను చెప్పిందంతా నిజం కాదు.ఏదో సరదాగా అలా చెప్పాను.సోనమ్, దుల్కర్‌కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.వారిద్దరినీ నేను ఎంతగానో గౌరవిస్తాను అని రానా ట్వీట్ చేశా