రంగస్థలం పాట వారిని బాధించిందట!

Rangamma Mungamma is the stage song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈమద్య ఏ సినిమా చేసినా కూడా ఏదో ఒక వివాదాస్పదం అవుతూనే ఉంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల ప్రతి సినిమా విషయం కూడా వివాదం అవుతూనే ఉంది. టైటిల్‌ లేదా డైలాగ్‌ లేదా మరేదైనా విషయంతో పబ్లిసిటీ కోసం అంటూ కొందరు పోలీసులను ఆశ్రయించడం లేదా కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది. తాజాగా ‘రంగస్థలం’ చిత్రంలోని తాజాగా విడుదలైన రంగమ్మ మంగమ్మ… పాటలోని కొన్ని పదాలు తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని, ఆ పదాలు తమ సామాజిక వర్గంను అవమానించే విధంగా ఉన్నాయంటూ యాదవ సంఘం ఆందోళన వ్యక్తం చేశాడు. పాటలోని పదాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

సినిమా విడుదలైన తర్వాత ఆ పదాలు ఉంటే మాత్రం న్యాయ పోరాటంకు దిగుతామని, నిర్మాత మరియు దర్శకులను కలిసి ఈ విషయాన్ని చర్చించాలని భావిస్తున్నట్లుగా యాదవ కుల సంఘం అధ్యక్షుడు రాములు యాదవ్‌ అన్నారు. రంగమ్మ మంగమ్మ.. పాటలోని గొల్లభామ వచ్చి గోళ్లు గిల్లుతుంటే… అన్న చరణంపై రాములు యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంగమ్మ మంగమ్మ పాట ఇటీవలే విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్‌లో ఏకంగా మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇలాంటి పాటను వివాదం చేస్తే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతోనే రాములు యాదవ్‌ ఇలా మీడియా ముందు వచ్చి గొగ్గోలు చేస్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రంగస్థలం విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే వివాదం మొదలైంది. ఇంకా ముందు ముందు ఎలాంటి వివాదాలు వస్తాయో చూడాలి.