Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం సూపర్ హిట్‌ను దక్కించుకుంది. నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుని టాప్ 3 జాబితాలో చేరింది. ‘రంగస్థలం’ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. లాంగ్ రన్లో రంగస్థలం 200 కోట్లను వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా రంగస్థలం చిత్రం 185 కోట్ల కలెక్షన్స్ వద్ద ఆగిపోయింది. తాజాగా విడుదలైన ‘భరత్ అనే నేను’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రానికి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
‘రంగస్థలం’ జోరు మరో వారం రోజులు కొనసాగితే సునాయాసంగా 200 కోట్లు వచ్చేవి. కాని మహేష్‌బాబు చిత్రం రావడంతో రామ్ చరణ్ 200 కోట్ల కల చెదిరిపోయింది. ఇప్పటికే టాలీవుడ్ నెం.3గా నిలిచిన రంగస్థలం చిత్రం పలు చిత్రాలకు దూరంగా ఉంది. అయితే భరత్ అనే నేను చిత్రం ఆ చిత్రం కలెక్షన్స్‌ను బీట్ చేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ 200 కోట్లను వసూళ్లు చేసి ఉంటే భరత్‌కు ఆ కలెక్షన్స్‌ను బీట్ చేయడం కాస్త కష్టం అయ్యేది. కాని ప్రస్తుతం భరత్‌కు వస్తున్న టాక్ నేపథ్యంలో సునాయాసంగానే రంగస్థలం చిత్రం కలెక్షన్స్‌ను క్రాస్ చేస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ‘భరత్ అనే నేను’ చిత్రంపై ప్రస్తుతం సినీ వర్గాల దృష్టి ఉంది. ఒక వేళ భరత్ అనే నేను చిత్రం 200 కోట్లు వసూళ్లు చేస్తే సూపర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దు ఉండదని చెప్పుకోవచ్చు.