మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ అండ్‌ గుడ్‌ న్యూస్‌

rangasthalam 1985 movie before that PSPK movie release

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యాన్స్‌కు ఒకే వార్త బ్యాడ్‌ మరియు గుడ్‌ అయ్యింది. అదేంటి అంటే వచ్చే సంక్రాంతికి పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం మరియు రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు తక్కువ రోజుల వ్యవదిలో విడుదల కాబోతున్నాయని వార్తలు వచ్చాయి. దాంతో రెండు సినిమాల కలెక్షన్స్‌పై కూడా ప్రభావం ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. అలా ఇబ్బంది కాకుండా చరణ్‌ డిసెంబర్‌లో రావాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకున్నారు. కాని డిసెంబర్‌లో ‘రంగస్థలం’ సిద్దం అయ్యే ఛాన్స్‌ లేదని, ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ ఇటీవలే సుకుమార్‌ చెప్పుకొచ్చాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్‌ చాలా మందకోడిగా సాగుతుందని, అనుకున్నట్లుగా కాకుండా కాస్త ఆలస్యంగా షూటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక వేళ సంక్రాంతికి సినిమా విడుదల కాకుంటే ఏప్రిల్‌ వరకు విడుదల అవ్వడం కష్టమే. అందుకే ఇది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. ఇక గుడ్‌ ఏంటి అంటే బాబాయి, అబ్బాయి ఢీ కొట్టుకోవడం లేదు. రంగస్థలం ఆలస్యంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సుకుమార్‌ మాత్రం ఇంకా కూడా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేద్దాం అంటున్నాడట.

షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉండటంతో పాటు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. వాటి గ్రాఫిక్స్‌కు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే సినిమా విడుద లేట్‌ అవ్వడం ఖాయం అంటున్నారు. చరణ్‌ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుగా మెగా ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం సంక్రాతికి రావడం 100 శాతం ఖాయం అన్నట్లుగా ఉంది. దీపావళికి పవన్‌ 25 చిత్రం టైటిల్‌ను ప్రకటించి టీజర్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి.