Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ హైప్ మధ్య రంగస్థలం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్, హీరో, హీరోయిన్లు చరణ్, సమంత గెటప్ లు, సాంగ్స్ వంటి విషయాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారాయి. తాజగా రంగస్థలం గురించి మరో విషయం తెగ చర్చనీయాంశంగా మారింది. రంగస్థలం నిడివి 179 నిమిషాలు. అంటే ఒక్కనిమిషం తక్కువగా మూడు గంటలు. ఇవాళ్టి రోజుల్లో రెండున్నర గంటల సినిమా చూడడానికే జనాలకు మొహం మొత్తుతోంది. అలాంటిది మూడు గంటల పాటు ప్రేక్షకులు కదలకుండా థియేటర్ లో కూర్చుంటారా అన్న అనుమానంతో వీలైనంత తక్కవ నిడివితో సినిమాలు తీస్తున్నారు నిర్మాత, దర్శకులు.
ఈ ట్రెండ్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి మార్చేశాడు. మూడు గంటలా రెండు నిమిషాల నిడివి ఉన్న అర్జున్ రెడ్డి ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమాలో విషయం ఉంటే నిడివి ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదని అర్జున్ రెడ్డి నిరూపించింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తే మరేమో కానీ…ఇప్పుడు రంగస్థలం కూడా మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోపెట్టనుంది. అసలైతే ఇంత భారీ నిడివి ఉన్న సినిమాను ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహంతో నిడివిని కొంత తగ్గించాలని చిత్రబృందం భావించింది. అయితేసినిమా చూసిన చిరంజీవి ఎలాంటి కోతలూ పెట్టొద్దనీ, ప్రతిసన్నివేశానికి ప్రాధాన్యం ఉందని సూచించారు. ఆయన సలహా మేరకు కత్తిరింపు ఆలోచనలను చిత్రయూనిట్ పక్కనపెట్టింది.