సమంత కోసం వెరైటీ గా ప్లాన్ చేస్తున్నారు…

Rangasthalam movie Samantha teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్రమోషన్‌ చేసేందుకు అప్పుడే ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే రామ్‌ చరణ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ మరియు టీజర్‌ వచ్చిన విషయం తెల్సిందే. ఇక త్వరలో సమంత టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సహజంగా తెలుగు సినిమాల హీరోయిన్స్‌కు ప్రత్యేక టీజర్‌లు విడుదల చేయడం అంటూ జరగదు. కాని రంగస్థలం చిత్రంలో సమంతకు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అవ్వడంతో ప్రత్యేకంగా టీజర్‌ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత షాట్స్‌ను ఎడిట్‌ చేస్తున్నారు. సమంత నేపథ్యంలో 20 సెకన్ల టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత పాత్ర గురించి సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. చరణ్‌ ఈ చిత్రంలో చెవిటి వాడిగా కనిపించబోతున్నట్లుగా తేలిపోయింది. ఇక సమంత మూగ అమ్మాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఆ విషయంపై టీజర్‌ విడుదల అయితే కాని క్లారిటీ రాదు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో నటిస్తున్న విషయం తెల్సిందే.