‘రంగస్థలం’ టీజర్‌ రివ్యూ

Rangasthalam Teaser review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ చిత్రం టీజర్‌ విడుదల అయ్యింది. ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగానే రామ్‌ చరణ్‌ ఈ చిత్రంలో చెవిటి వాడిగా కనిపించబోతున్నట్లుగా టీజర్‌తో తేలిపోయింది. ఒక పల్లెటూరు కుర్రాడి పాత్రలో, 1980 బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం కొనసాగబోతుంది. సినిమాపై అంచనాలు రేకెత్తించే విధంగా టీజర్‌ను కట్‌ చేసి వదిలారు. మార్చి 30వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా టీజర్‌ ద్వారా మరోసారి అధికారిక ప్రకటన చేశారు. ఈ టీజర్‌లో చరణ్‌ లుక్‌ అదిరిందని, మెగా ఫ్యాన్స్‌ అంచనాలు అందుకునేలా దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని టీజర్‌ను బట్టి అర్థం అవుతుంది. ఇదో విభిన్న చిత్రంగా నిలుస్తుందని, తప్పకుండా చరణ్‌ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం అవుతుందని టీజర్‌ ద్వారా నమ్మకం కలిగింది. 

టీజర్‌లో చరణ్‌ చెప్పిన డైలాగ్‌.. అందరికీ సౌండ్‌ వినిపిస్తుంది, నాకు సౌండ్‌ కనపడుద్ది… అప్పుడే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. చరణ్‌ చెవిటి వాడి పాత్రలో నటించడం అంటే సాహస నిర్ణయం అని చెప్పుకోవాలి. అలాంటి సాహస నిర్ణయం తీసుకుని రామ్‌ చరణ్‌ గ్రేట్‌ అనిపించుకున్నాడు. ఇక సినిమా విడుదల తర్వాత ఇంకెంతగా మంచి పేరు తెచ్చుకుంటాడో చూడాలి. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం ఆడియోను వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు మ్యూజికల్‌ సక్సెస్‌లుగా నిలిచాయి. అందుకే ఈ సినిమా పాటలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయనే నమ్మకంగా ఉన్నారు. 1980 నేపథ్యంలోనే సంగీతం కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై ఒక అభిప్రాయం వచ్చింది. ఇక సినిమాపై మరింతగా అంచనాలు పెంచుకుని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.