Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : రాజ్ తరుణ్, చిత్ర శుక్ల, సితార
దర్శకత్వం : శ్రీ రంజని
నిర్మాత : నాగార్జున
మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకల
2018 సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు, హీరోలు వెనుకబడడం చూసి అనూహ్యంగా అదృష్టం పరీక్షించుకుందామని ముందుకు వచ్చింది రంగులరాట్నం. రాజ్ తరుణ్, చిత్ర కాంబినేషన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం మీద శ్రీరంజని అనే మహిళా దర్శకురాలిని పరిచయం చేస్తూ వచ్చిన రంగులరాట్నం ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. దీంతో సినిమాలో కూడా ఏదో విషయం వుండివుంటుందనే అంచనాలు కుర్రకారులో ఏర్పడ్డాయి. ఆ అంచనాలని రంగులరాట్నం ఏ మాత్రం నిలబెట్టుకుందో చూద్దాం.
కథ…
విష్ణు( రాజ్ తరుణ్ ) అతని స్నేహితుడు ( ప్రియదర్శి ) ఓ గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీలో పనిచేస్తుంటారు. విష్ణుకి తల్లి అంటే ప్రాణం. ఆమెకి కూడా విష్ణు తప్ప వేరే లోకం ఉండదు. అలాంటి విష్ణు ,కీర్తి ( చిత్ర ) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమకి ఓకే చెబుతుంది. అయితే అన్ని ప్రేమకథలో లాగానే వీరికి కూడా ఓ సమస్య వస్తుంది. ఆ జంట దూరం అవుతుంది. ఆ జంట మళ్ళీ కలుస్తుందా ? వాళ్ళు విడిపోడానికి కారణం ఏమిటి ? దాన్ని ఎలా అధిగమిస్తారు అన్నదే మిగిలిన చిత్ర కథ.
విశ్లేషణ…
ఓ కధగా చూసుకున్నప్పుడు ఇది ఓ క్యూట్ లవ్ స్టోరీ. తీసుకున్న సెంట్రల్ పాయింట్ కూడా దాన్ని బలపరిచేదే. అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ని వేర్వేరుగా రెండు వేర్వేరు సినిమాలు చుస్తున్నామా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ డామినేట్ చేశాయి. తల్లి సెంటిమెంట్ ఈ స్థాయిలో వుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో కథతో ఏదో లింక్ ఉంటుంది అనుకుంటే ఆ థ్రెడ్ చాలా బలహీనంగా వుంది. ఉన్నంతలో ఈ సినిమాకి సేవింగ్ ఫాక్టర్ ఒకటుంది. అదే అక్కడక్కడా పండిన వినోదం. రాజ్ తరుణ్ , ప్రియదర్శి మధ్య కామెడీ పర్లేదు అనిపించింది. కానీ సెంటిమెంట్ డోస్ ఆ కామెడీ ని గుర్తుకు రాకుండా చేస్తుంది.
రాజ్ తరుణ్, చిత్ర , సితార , ప్రియదర్శి ఈ సినిమాకు తగ్గట్టు బాగా చేశారు. అయితే దర్శకురాలు శ్రీరంజని సినిమా సెంట్రల్ పాయింట్ మీద పెట్టిన దృష్టి కధనం మీద పెట్టి ఉంటే బాగుండేది. రాసుకున్న సీన్స్ కూడా ఒకే విధంగా రిపీట్ అవుతున్నాయి అనిపిస్తుంది. కధనం విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే మంచి సినిమా అయ్యేది. ఇప్పుడు మరో రొటీన్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా మిగిలిపోయింది. ఇక నిర్మాణం పరంగా చూస్తే విలువలు అంత బాగా లేవనే చెప్పుకోవాలి. తక్కువలో తీసిన సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి తెలుస్తుంది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ … ప్రేమ రంగులరాట్నం ఎక్కుదాం అనుకుంటే సెంటిమెంట్ దెబ్బకి కళ్ళు తిరుగుతాయి.
తెలుగు బులెట్ రేటింగ్… 2.5 / 5 .