ఎమ్మెల్యే మీద రేప్ కేస్…ఆమెనే పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

rape case on mla

తనపై రేప్ కేసు పెట్టిన యువతినే పెళ్లాడి వార్తలలో నిలిచారు త్రిపురలోని అధికార ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఎమ్మెల్యే ధనంజోయ్. రాష్ట్రంలోని దలాయికి చెందిన మహిళ గత నెల 20న అగర్తలలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ధనంజోయ్‌పై అత్యాచారం కేసు పెట్టింది. తనను శారీరకంగా లొంగదీసుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా సాన్నిహిత్యం ఉందని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ముందస్తు బెయిలు కోసం ధనంజోయ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరోమార్గం లేక ఆదివారం తనపై కేసు పెట్టిన మహిళను వివాహం చేసుకున్నారు. అగర్తలలోని చతుర్‌ దాస్ దేవతా ఆలయంలో వీరి వివాహం జరిగినట్టు ధనంజోయ్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరైనట్టు పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న నేపధ్యంలో భవిష్యత్తులో ఎవరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకూడదన్న ఒప్పందానికి కూడా వచ్చినట్టు తెలిపారు.