Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలతో ఆకట్టుకుంటున్న రష్మీ ఈమద్య వెండి తెరపై కూడా తెగ కనిపిస్తోంది. ఈమె రియాల్టీ షోలు మరియు స్టేజ్ షోల్లో చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మీ తన పారితోషికంను అమాంతం పెంచేసింది. ఒక స్టేజ్ షో ఇచ్చేందుకు లక్షల్లో పారితోషికం తీసుకుంటుంది. తాజాగా నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు ఒక కార్యక్రమంను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం కోసం ఈమెను ఆహ్వానించారు. అయితే రష్మీ భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను వద్దనుకున్నారు. ఆమె వస్తుందని మొదట పబ్లిసిటీ చేశారు.
ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో రాదని తెలిసి కూడా రష్మీ కార్యక్రమంకు వస్తుందంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అధికారిక ప్రకటనలో కూడా రష్మీని ఉంచి ప్రకటనలు చేశారు. అలా చేయడం వల్ల కార్యక్రమంకు మంచి క్రేజ్ దక్కుతుందని, ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారని వారు భావించారు. కాని రష్మీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రానని చెప్పినా కూడా ఎందుకు తన పోస్టర్లను వాడుతున్నారు అంటూ కోపంతో షో నిర్వాహకులపై మండి పడటం జరిగింది. ఇలా తన అనుమతి లేకుండా ఫొటోలను వాడినందుకు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ఈ ఫొటోలను వాడటం ఇలాగే కంటిన్యూ చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్దమవుతాను అంటూ హెచ్చరించింది. ఎప్పుడు జోవియల్గా ఉండే రష్మీకి నాటా వారు ఇంత కోపంను తెప్పించారన్నమాట.