మూడవ సినిమాకే అంత పెద్ద సాహసమా?

Rashmika acts without makeup in her next movie

నాగశౌర్యతో కలిసి నటించిన ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక తాజాగా గీత గోవిందం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్‌ దేరకొండతో ఈమె చేసిన గీత గోవిందం చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. విజయ్‌ దేవరకొండతో ఈమె చేసిన రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌ అయ్యింది. విజయ్‌తో ఈమె సీన్స్‌ యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యాయి. విజయ్‌ దేవరకొండతో పోటీ పడి మరీ నటించిన రష్మిక మందన తన మూడవ సినిమాను కూడా విజయ్‌ దేవరకొండతోనే చేయబోతుంది. గీత గోవిందం చిత్రం విడుదల కాక ముందే వీరిద్దరి కాంబోలో ‘డియర్‌ కాంమ్రెడ్‌’ చిత్రం కన్ఫర్మ్‌ అయ్యింది.

Rashmika

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో రష్మిక క్రికెట్‌ ప్లేయర్‌గా కనిపించబోతుంది. ఈ చిత్రం కోసం రష్మిక మేకప్‌ లేకుండా నటించబోతుంది. హీరోయిన్స్‌ సహజంగా మేకప్‌ లేకుండా బయటకే రారు. అలాంటిది మేకప్‌ లేకుండా సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్స్‌ మేకప్‌ లేకుండా నటించడం తమిళంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కాని తెలుగులో మేకప్‌ లేకుండా నటించడం అంటే పెద్ద సాహసమే. ఒక వేళ ఫలితం తేడా కొడితే కెరీర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే రష్మిక మూడవ సినిమాతోనే పెద్ద సాహసం చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika acts without makeup