కన్నడ డైరెక్టర్ రక్షిత్ శెట్టి టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా తెలుసు . తాను డైరెక్టర్ చేసిన మూవీ లు తెలుగులో అవ్వటం ఒక కారణమైతే, హీరోయిన్ రష్మికతో ఎంగేజ్మెంట్ అయ్యి, పెళ్లి దాకా వెళ్లి క్యాన్సల్ అవ్వడం ఏంటి దానికి కారణం. ప్రస్తుతం సప్త సాగరాలు దాటి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రక్షిత్ శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ తన పెళ్లి గురించి రెస్పాండ్ అయ్యాడు.
రక్షిత్ శెట్టి పెళ్లి గురించి మీడియా ప్రశ్నించగా.. అమ్మాయి లాగా మెలికలు తిరిగిన రక్షిత్ త్వరలోనే తన పెళ్లి అంటూ సమాధానం ఇచ్చాడు. పెళ్లి గురించి అడగ్గానే.. రక్షిత్ శెట్టి సిగ్గు పడ్డ తీరు చూస్తుంటే.. త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. రక్షిత్, రష్మికల పెళ్లి ఆఖరి వరకు వచ్చి ఆగిపోవడం రక్షిత్ ఎంగేజ్మెంట్ తర్వాత రష్మికకి కన్నడ తో పాటు సౌత్ లో కూడా క్రేజ్ పెరగటమే బ్రేకప్ చెప్పడానికి దానికి కారణం అని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో రష్మిక ఇచ్చిన స్టేట్మెంట్ కన్నడ ఇండస్ట్రీ వర్గాలను గురి చేస్తున్నాయి.
రక్షిత్ తన మూవీ లను కన్నడతో పాటు తెలుగులో కూడా వరుసగా డబ్ చేస్తుండటం చూస్తుంటే తెలుగులో ఫేమ్ సాధించి, రష్మికకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు . మరి మీడియాలో ఊహాగానాలు వచ్చినట్లు రక్షిత్ శెట్టి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేక ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ ప్రకారం ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అన్నది వేచి చూడాలి.