Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజ రవితేజ కింది స్థాయి నుండి స్టార్ హీరోగా ఎదిగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాలనుకున్న రవితేజకు అనుకోకుండా హీరో అవకాశం దక్కింది. ఆ అవకాశంను సద్వినియోగం చేసుకున్న రవితేజ హీరోగా దాదాపు దశాబ్ద కాలం పాటు దుమ్ము దుమ్ముగా సినిమాలు చేశాడు. మాస్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన రవితేజ కొంత కాలం ముందు వరకు తన ఫ్యామిలీ గురించి అస్సు తెలియనివ్వకుండా ఉండేవాడు. రవితేజకు పెళ్లి అయ్యిందా, పిల్లలు ఉన్నారా అనే విషయాలు కూడా చాలా మందికి తెలిదు. రవితేజకు పెళ్లి చాలా సంవత్సరాల క్రితమే అయ్యింది. ఈయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలను ఇటీవల సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తున్నాడు. ఆమద్య తన భార్యతో కలిసి ఉన్న సెల్ఫీని పెట్టిన తర్వాత కుటుంబంకు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడు, సందర్బానుసారంగా పోస్ట్ చేస్తూ వస్తున్నాడు.
తాజాగా విదేశాల్లో కుటుంబంతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఒక ఫొటోను రవితేజ పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో రవితేజతో పాటు కొడుకు మరియు కూతురు ఉన్నారు. ఆ ఫొటోలో గాంధీ గారి మూడు కోతుల మాదిరిగా వీరు ముగ్గురు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కుటుంబం గురించి గతంలో పట్టించుకోడు అంటూ రవితేజపై విమర్శలు ఉన్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రవితేజలో ఈ మార్పు సూపర్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో తీసుకున్న ఫొటోను స్వయంగా రవితేజ పోస్ట్ చేయడం జరిగింది.