స్క్రిప్ట్‌ రెడీ చేసిన వైట్ల.. ఎవరికంటే!

Ravi Teja Gives Movie chance to Srinu Vaitla

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘దూకుడు’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయిన శ్రీనువైట్ల ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా సక్సెస్‌ లేదా మినిమం పర్వాలేదు అనిపించుకునే తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. ‘బాద్‌షా’, ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్‌’ ఇలా వరుసగా నాలుగు డిజాస్టర్‌లు వచ్చిన తర్వాత ఏ హీరో కూడా శ్రీనువైట్లతో సినిమా చేయాలి అంటే ముందుకు వస్తాడు చెప్పండి. ఆయన వెళ్లి అడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పుకుంటారు. శ్రీనువైట్లపై సినీ వర్గాల్లో పూర్తిగా విశ్వాసం కనబర్చే వారే లేరు. అయితే శ్రీనువైట్లపై అభిమానంతో రవితేజ ముందుకు వచ్చాడు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అవి రవితేజ కెరీర్‌లో చాలా కీలక పాత్ర పోషించాయి. మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండేందుకు కారణం ఖచ్చితంగా ఆ సినిమాలు ముఖ్య పాత్ర పోషించాయి అని అందరు భావించడంతో పాటు, రవితేజ కూడా అనుకుంటూ ఉంటాడు. అందుకే తనకు లైఫ్‌ ఇచ్చిన దర్శకుడికి ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని రవితేజ భావిస్తున్నాడు. రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గత మూడు నెలలుగా ఒక స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో శ్రీనువైట్ల ఉన్నాడు. తాజాగా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. రవితేజ కూడా స్క్రిప్ట్‌కు ముద్ర వేశాడు. నల్లమల్లపు బుజ్జి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘రాజా ది గ్రేట్‌’, ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాల తర్వాత శ్రీనువైట్ల సినిమాను రవితేజ చేస్తాడు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో సినిమా ఆరంభం కానుంది, అదే సంవత్సరం చివర్లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశాలున్నాయి

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డికి వర్మ వింత సలహ

పైసా వసూల్ ప్రివ్యూ .

కత్తి మహేష్‌ ఇష్యూ జాతీయ మీడియాలో..!