దేశంలో సంచలనం సృష్టించిన కథతో రవితేజ-గోపిచంద్‌ మలినేని మూవీ?

Ravi Teja
Ravi Teja

యదార్ధ సంఘటనల ఆధారంగా అన్ని కనిపిస్తే చాలు ఆ సినిమాపై ఎక్కడా లేని క్యూరిసిటీ అయితే వచ్చేస్తుంది. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిజం జీవితం కథలు. మరవరం పడిపోయే కథలను గురించి వాస్తవం చర్చించే కథలుగా సినిమా రూపంలో తెరకెక్కుతున్నాయి అంటే అందరిలోనూ అమితాస్తి నెలకొంటుంది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం చుండూరు అనే గ్రామంలో దాదాపు 3 వదల మంది అగ్రవర్గానికి చెందిన వ్యక్తులు అత్యంత క్రూరంగా 8 మంది దళితులను హత్య చేశారు. ఈ ఘటనను చుండూరు హత్యకాండగా అభివర్ణిస్తుంటారు.ఆ సమయంలో దళితుల్ని ఉచకోత కోసిన ప్రదేశంగా చుండూరు చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి కథనే గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వీటికి` ఇటీవల రిలీజైన పోస్టర్‌ కూడా బలం చేకూర్చుతుంది. మోషన్‌ పోస్టర్‌లో మంటల్లో తగలబడిపోతున్న గ్రామాన్ని చూపించారు.అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇదే కదా నిజమైతే మాత్రం గోపీచంద్ మలినేని రిస్క్ చేసినట్లే అని పలువురు నిటిజన్లు అభిప్రాయం పడుతున్నారు. గతంలో క్రాక్ విషయంలోనూ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఘటనల్ని బేస్ చేసుకుని తరికెక్కించాడు. అప్పుడు ఆ ప్రాంతాల వారు పెద్ద ఎత్తున విమర్శనాలు కూడా చేశారు. ఇక ఇప్పుడూ మరోసారి అంతకుమించి అన్న విధంగా ఈ కథ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అలాంటి ఇష్యూను తెరపై చూపించబోతున్నాడంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయాలు పడుతున్నారు.