Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ ఖాతాలో మరో ఫ్లాప్ ‘నేల టిక్కెట్టు’ రూపంలో చేరింది. కాస్త గ్యాప్ తీసుకుని రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ రవితేజ సక్సెస్‌లు దక్కించుకుంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత వరుసగా అట్టర్ ఫ్లాప్ ఈయన ఖాతాలో పడుతూ వస్తున్నాయి. ‘రాజా ది గ్రేట్’తో పాటు మొదలు పెట్టిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ సినిమా ఫలితం నుండి బయటపడుతున్న సమయంలోనే రవితేజకు ‘నేలటిక్కెట్టు’ రూపంలో గట్టి దెబ్బ పడ్డట్లయ్యింది. కోలుకోలేని విధంగా రవితేజకు షాక్ తలిగింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ‘నేలటికెట్టు’ చిత్రం బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడటంతో అంతా షాక్ అవుతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అనగానే అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం లేదని విడుదలైన మొదటి రోజే తేలిపోయింది. రవితేజ గతంలో చేసిన తప్పే ఈ సినిమాకు చేయడం వల్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది అంటూ టాక్ వినిపిస్తుంది. గతంలో రవితేజ కథను పట్టించుకోకుండా, కేవలం తన పాత్రకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ సినిమాలు చేశాడు. అలా చేయడం వల్ల చాలా సినిమాలు ఆయనకు ఫ్లాప్‌ను ఇచ్చాయి. తాజాగా టచ్ చేసి చూడు మరియు నేల టిక్కెట్టు చిత్రాలు కూడా హీరో పాత్ర బాగానే ఉంది. కాని హీరో పాత్ర చుట్టు అల్లిన కథ బాగాలేదు. దాంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. రాజా ది గ్రేట్ కూడా దర్శకుడు అనీల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్తో నడిపించాడు. రవితేజ ఇప్పటికి అయినా జాగ్రత్త పడకుంటే మరింతగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.