హోంగార్డు రవీందర్ మృతి… హోంగార్డుల నిరసనలు

హోంగార్డు రవీందర్ మృతి... హోంగార్డుల నిరసనలు
హోంగార్డుల నిరసనలు

గత మంగళవరం సాయంత్రం, చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు గా పనిచేస్తున్న, ఛత్రినాక ఉప్పుగూడకు చెందిన ఎం రవీందర్ (36), నెలవారీ జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గోషామహల్ పోలీస్ స్టేడియం సమీపంలోని కమాండెంట్ హోంగార్డు కార్యాలయానికి వెళ్లి జీతం చెల్లింపు గురించి ఆరా తీసేందుకు ప్రయత్నించాడు. సంబంధిత అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నవారు సకాలంలో జోక్యం చేసుకోని అతడి ప్రాణాలను కాపాడేందుకు చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

తీవ్రగాయాల పాలై మూడు రోజులుగా చికిత్స పొందుతు, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రవీందర్ డీఆర్డీఓ అపోలోలో శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉస్మానియా పరిసరాల్లో ఉద్రిక్త నెలకొంది.

హోంగార్డు రవీందర్ మృతి... హోంగార్డుల నిరసనలు
home guard Nagam Ravinder

హోంగార్డు నాగం రవీందర్‌ మృతి చెందడంతో రవీందర్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు హోంగార్డులు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డులందరూ విధుల్లో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు చీఫ్ ఇన్ స్పెక్టర్ (సీఐ)లను ఆదేశించారు. విధుల్లో లేని హోంగార్డులు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలన్నారు. హోంగార్డులందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు.

అదనంగా, ఎవరైనా డ్యూటీకి రిపోర్ట్ చేయడంలో విఫలమైతే, వారు తమ స్థానం నుండి తొలగించబడతారని హెచ్చరిక జారీ చేసారు.