జాతీయ జట్టుకు మరియు ఐపీఎల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యన అమెరికాలో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ లో ఆడే అవకాశం దక్కినా , బీసీసీఐ అనుమతించకపోవడంతో మొదటి సీజన్ కు రాయుడు మిస్ అయ్యాడు. కానీ ఇప్పుడు బీసీసీఐ రాయుడు ప్రపంచంలో ఎక్కడైనా లీగ్ లు ఆడొచ్చని అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు కరేబియన్ లీగ్ లో ఆడనున్నాడు.
సౌత్ ఆఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్ కొన్ని కారణాల వలన ఈ లీగ్ లో ఆడకుండా తప్పుకుంటున్నందున అతని స్థానంలో రాయుడును సెయింట్ కీట్స్ అండ్ నేవీస్ పేట్రియాట్స్ ఫ్రాంచైజీ తీసుకుంది. ఈ లీగ్ ఆడుతున్న ఇండియన్ క్రికెటర్ లలో రాయుడు రెండవవాడు గా గుర్తింపు పొందాడు.మొదటగా ప్రవీణ్ తాంబే కింగ్స్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. మరి తుది జట్టులో చోటు దక్కించుకుని జట్టు విజయానికి రాయుడు గట్టిగా కృషి చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.