క్రికెట్ ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేమంటే… ఐపీఎల్ 2020 ఇండియా వెలుపల నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేమంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ సైమన్ కటిచ్ 2020 ఐపీఎల్ ను భారతదేశం వెలుపల నిర్వహించే ఆలోచనకు సపోర్ట్ చేశాడు. నగదు అధికంగా ఉన్న ఈ ఐపీఎల్ లీగ్ ఈ సంవత్సరం ఏదో ఒక సమయంలో బీసీసీఐ నిర్వహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన స్పష్టం చేశాడు.
కాగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నకరోనా మహమ్మారి నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఐపీఎల్ ను ‘తదుపరి నోటీసు వచ్చేవరకు’ నిలిపివేసింది. అయితే ఈ టోర్నీ ఆస్ట్రేలియా లేక.. దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తే తమకు చాలా మేలు జరుగుతుందని తమ టీం చాలా సంతోష పడుతుందని అని సైమన్ కటిచ్ స్పష్టం చేశాడు. ఎందుకంటే ఆర్సీబీ జట్టులో ఆ రెండు దేశాలకు సంబంధించిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారని.. వారు తమ సొంత గడ్డపై చెలరేగుతారని వివరించాడు. అయితే ఇదివరకు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2009లో దక్షిణాఫ్రికాలో జరిగింది. కాగా ఆ తర్వాత అదే కారణంతో.. టోర్నమెంట్లో కొన్ని మ్యాచ్‌లు 2014లో యుఎఇలో జరిగాయి. అయితే టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచేచందుకు బీసీసీఐ సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలోనే కావచ్చన్నది అంచనా.