శైలజ రెడ్డి అల్లుడు విడుదలపై అనుమానాలు!

Re-recording works not completed on sailaja reddy alludu

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల 31న చిత్రాన్ని విడుద చేయాలని రెండు మూడు నెలల క్రితమే నిర్ణయించారు. అంతా అనుకున్నట్లుగానే షూటింగ్‌ జరిగి పోయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చేలా ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనిపిస్తుంది. కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ ఇవ్వడం జరిగింది. ఆయనతో ఈ చిత్రానికి రీ రికార్డింగ్‌ చేయించేందుకు మారుతి కేరళ వెళ్లాడు.

sailaja reddy alludu

దాదాపు వారం పది రోజులుగా మారుతి అక్కడే ఉండి పోయాడు. సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్‌ పనులను గోపీసుందర్‌ రికార్డింగ్‌ స్టూడియోలో నిర్వహిస్తున్నారు. ఒక వైపు భారీగా వర్షాలు పడుతున్న కారణంగా రీ రికార్డింగ్‌ కాస్త ఇబ్బందిగా మారింది. ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన రీ రికార్డింగ్‌ అసలు ఎప్పుడు పూర్తి అవ్వనుందో తెలియడం లేదు. ఇంకా గంట సినిమాకు రీ రికార్డింగ్‌ వర్క్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

sailaja reddy alludu

రీ రికార్డింగ్‌ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాను వాయిదా వేయడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమాను వాయిదా వేయబోవడం లేదని, జేబీతో రీ రికార్డింగ్‌ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని మారుతి భావిస్తున్నాడు అని, అదే విషయాన్ని నిర్మాతతో చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. నేడో రేపో మారుతి కేరళ నుండి దిగే అవకాశం ఉంది. ఆ వెంటనే రీ రికార్డింగ్‌ వర్క్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయించి సినిమాను విడుదల చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి శైలజ రెడ్డి అల్లుడు వచ్చే వరకు కాస్త అనుమానంగానే అనిపిస్తుంది.

sailaja reddy alludu