ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే రూ.1,000 కోట్ల విక్రయాలను పూర్తి చేసినట్లు గుర్గావ్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎం3ఎం ఇండియా ప్రకటించింది. ఎన్సీఆర్లోని నేషనల్ పెరిఫెరల్ రోడ్ సెక్టార్ 89లో నిర్మిస్తున్న ఎం3ఎం సౌలిట్యూడ్ ప్రాజెక్ట్‌లు ఈ అమ్మకాలు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
వెయ్యి యూనిట్ల ఈ ప్రాజెక్ట్‌ను 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది. 1,100 చ.అ. నుంచి 1,400 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే యూనిట్లను నిర్మిస్తోంది. ధరలు రూ.70–90 లక్షల మధ్య ఉన్నాయని కంపెనీ డైరెక్టర్ పంకజ్ భన్సాల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.3,034 కోట్ల విక్రయాలను చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో నిర్మాణంలో ఉన్న నివాస ప్రాజెక్ట్‌లలో రూ.1,450 కోట్లు, కమర్షియల్‌లో రూ.835 కోట్లు, పూర్తయిన ప్రాజెక్ట్‌లలో రూ.749 కోట్ల అమ్మకాలు చేశామన్నారు.