డోక్లామ్ కు రియల్ హీరో అజిత్ ధోవలేనా..?

Real Hero Ajith Doval Is more Than Modi To Doklam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారత్ చైనా మధ్య రెండున్నర నెలలుగా నలుగుతున్న డోక్లాం సంక్షోభానికి తెరపడింది. ఏదో రకంగా దౌత్య ఒత్తిడికి తలొగ్గిన చైనా భారత్ తో పాటుగా బలగాలు వెనక్కు తీసుకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు డోక్లాంలో యథాపూర్వ స్థితి నెలకొంది. దీంతో యుద్ధం వస్తుందని భయపడ్డ భూటాన్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ సంక్షోభంలో భూటాన్ కూడా ప్రశంసనీయమైన పాత్ర పోషించింది.

డోక్లాం వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో… ఎప్పుడూ మోడీని తిట్టే కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. డోక్లాం విషయంలో ఇంత బాగా పనిచేసిన మోడీ.. కశ్మీర్ ను ఎందుకు అలా వదిలేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మోడీ కంటే రియల్ హీరో అజిత్ ధోవలేనని తెలుస్తోంది. జాతియ భద్రతా సలహాదారుగా ఉన్న ధోవల్ చైనాను బాగా దారికితెచ్చారు.
డోక్లాం భారత్ భూభాగం కాదని వాదిస్తున్న చైనా.. ధోవల్ ను కూడా సూటిగా అదే అడిగిందట. అయితే ధోవల్ మాత్రం ఎక్కడా తొణకలేదట. ప్రతి వివాదాస్పద భూభాగం చైనాకు చెందుతుందా అని ధోవల్ ప్రశ్నించడంతో.. చైనా దగ్గర ఆన్సర్ లేదు. పైగా రెండు దేశాలకు మధ్య వైరం మంచిది కాదని, వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని చెప్పడంతో.. చివరకు డ్రాగన్ తోక ముడిచింది. దీంతో అందరూ ధోవల్ ను పొగుడుతున్నారు.

మరిన్ని వార్తలు:

నోట్ల కథకు అంతులేదా మోడీ

ఉండవల్లికి మాట పడిపోయిందా ?