రియల్మీ పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ మొబైల్ రియల్మీ జీటీ 2 ప్రో ఈ సంవత్సరం జనవరిలో చైనాలో విడుదలైంది. అలాగే గ్లోబల్‌గా మరిన్ని దేశాల్లోనూ గత వారం అడుగుపెట్టింది. ఈ తరుణంలో Realme GT 2 Pro భారత్‌లో ఈ నెలలో లాంచ్ అవుతుందన్న సమాచారం బయటికి వచ్చింది. మార్చి నెలాఖరులోగా ఈ రియల్మీ బెస్ట్ మొబైల్ వస్తుందని లీకులు వచ్చేశాయి. అలాగే ఏ వేరియంట్లు, కలర్ ఆప్షన్లలో వస్తుందన్న సమాచారం కూడా బయటికి వచ్చింది.
భారత్‌లో రియల్మీ జీటీ 2 ప్రో విడుదల గురించిన సమాచారాన్ని టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో భారత్‌లో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్‌గా లాంచ్ అయిన పేపర్ బ్లాక్, పేపర్ వైట్, పేపర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఇక్కడ కూడా Realme GT 2 Pro లభ్యం కానుందని తెలిపారు.
అయితే Realme అధికారికంగా ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకురావడం గురించి ఇంకా ఏం చెప్పలేదు. అయితే చైనాలో విడుదల చేసిన ఫ్లాగ్షిప్ మొబైళ్లన్నింటినీ ఇప్పటి వరకు భారత్‌కు తీసుకొచ్చింది రియల్మీ. జీటీ 2 ప్రో విషయంలోనూ దాన్ని అనుసరించనుంది. రియల్మీ ఇండియా హెడ్ మాధవ్ సేత్ సైతం Realme GT 2 Pro భారత మార్కెట్లోకి వస్తుందని సంకేతాలు కూడా ఇచ్చారు.
ప్రస్తుతం Realme అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా రియల్మీ జీటీ 2 ప్రో ఉంది. యూరప్‌లో ఈ మొబైల్ ప్రారంభ ధర 649 యూరోలుగా ఉంది. అదే చైనాలో 3,899 యువాన్లు గా ఉంది. అయితే భారత్‌లో రియల్మీ జీటీ 2 ప్రో ప్రారంభ ధర రూ.50వేల నుంచి రూ.55వేల మధ్య ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
రియల్మీ జీటీ 2 ప్రో మొబైల్ 6.7 ఇంచుల అమోలెడ్ ఎల్టీవీఓ 2.0 క్వాడ్ హెచ్డీ+ 2కే డిస్ప్లేతో వస్తోంది. 120 హెర్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇక క్వాల్కామ్ పవర్ఫుల్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ నడుస్తుంది.
Realme GT 2 Pro ప్రో వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ Sony IMX766 ఫ్లాగ్షిప్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 65 వాట్ల సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ ప్యానెల్.. పేపర్ డిజైన్‌తో వినూత్నంగా ఉంటుంది.