అది చేయకపోయినా వేడి నీటి స్నానం చేస్తే చాలట !

ఈరోజు సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది అదేమిటి అంటే వ్యాయామం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేయడం ద్వారా కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే వేడినీటితో స్నానం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతుంది.. అలాగే వేడినీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని తేల్చారు. ఇందుకోసం 2,300 మంది మధ్య వయసు వ్యక్తులను దాదాపు 20 ఏళ్లపాటు పరిశీలించారు.

వీరిలో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసినవారు 20 ఏళ్ల కాలంలో సగం మంది మృతి చెందారు. వారంలో రెండు నుంచి మూడుసార్లు ఆవిరి స్నానం చేసినవారిలో 38 శాతం మంది మాత్రమే అదే కాలవ్యవధిలో మృతి చెందారు. ఎక్కువ సార్లు ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో పరిశోధకులు గుర్తించారు. ఆవిరి స్నానంతో రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వలనే ఈ ఫలితాలు కలుగుతున్నట్లు వారు చెబుతున్నారు.