చివరి నిమిషంలో సునీల్‌కు త్రివిక్రమ్‌ షాక్‌

Reason Behind Absence Of Sunil In Trivikram Agnathavasi Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు, కమెడియన్‌ కం హీరో సునీల్‌కు మద్య ఉన్న సన్నిహిత్యం ఏంటీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ప్రస్తుతం సునీల్‌ కమెడియన్‌గా స్థిరపడి, హీరోగా చేస్తున్నాడు అంటే త్రివిక్రమ్‌ సాయం చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కెరీర్‌ ఆరంభంలో త్రివిక్రమ్‌కు సునీల్‌ కూడా సాయం చేశాడు. ఇప్పుడు సునీల్‌కు మళ్లీ త్రివిక్రమ్‌ హెల్ప్‌ అవసరం అయ్యింది. హీరోగా వరుసగా ఫ్లాప్‌లు వస్తున్న నేపథ్యంలో మళ్లీ సునీల్‌ కమెడియన్‌గా చేయాలని భావించాడు. అందుకోసం అజ్ఞాతవాసిని సునీల్‌ ఎంచుకున్నాడు. త్రివిక్రమ్‌ను కోరగా అందుకు ఓకే చెప్పాడు.

trivikram-and-sunil

స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న సమయంలో పవన్‌ను ఒప్పించి సునీల్‌ కోసం ఒక కామెడీ ట్రాక్‌ను సిద్దం చేశాడు. మెయిన్‌ కథకు కాస్త దూరంగా ఆ కామెడీ ట్రాక్‌ నడిచే విధంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేశాడు. అయితే స్క్రిప్ట్‌ వర్క్‌ అంతా పూర్తి అయిన తర్వాత ఎందుకో ఆ కామెడీ ట్రాక్‌ వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడతారని త్రివిక్రమ్‌కు అనిపించిందట. అందుకే సెట్స్‌పైకి వెళ్లబోతున్న సమయంలో ఆ సీన్స్‌ను కట్‌ చేశాడు.

agnathavasi-movie

తన తర్వాత సినిమాలో తప్పనిసరిగా అవకాశం ఇస్తాను అంటూ సునీల్‌కు హామీ ఇచ్చి మరీ ఆ కామెడీ సీన్స్‌ను తొలగించడం జరిగింది. ఒకటి రెండు సీన్స్‌కు ఛాన్స్‌ ఉన్నా కూడా ఇస్తే మంచి పాత్ర ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మొత్తానికే సునీల్‌ పాత్రను తొలగించినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్‌ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ఆ సినిమాలో సునీల్‌కు ఛాన్స్‌ ఉండే అవకాశం ఉంది.