Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీతో ఢిల్లీలో ఇటీవల సీఎం చంద్రబాబు జరిపిన భేటీ విశేషాల గురించి బయటకు తలా ఓ మాట చెప్పుకున్నారు. కానీ లోపల ఏమి జరిగింది అన్న దాని గురించి ఇటు మోడీ గానీ అటు చంద్రబాబు గానీ సూటిగా బయటకు చెప్పలేదు. కానీ ఈరోజు కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలు చూస్తే మాత్రం బీజేపీ, టీడీపీ మధ్య తెగదెంపులు కి రంగం సిద్ధం అయ్యింది అనిపిస్తోంది. కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు విభజన సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ తలసరి ఆదాయం వున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు కలెక్టర్స్ కి వివరించారు. దీనికి కారణం విభజన వల్ల ఎదురైన సమస్యలే అని బాబు వివరించారు. విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం జాప్యం చేస్తోందని బాబు ఆవేదన చెందారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఇంకా ఇదే పద్దతిలో వెళ్తే విభజన హామీల అమలు కోసం అవసరం అయితే సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించడానికి రెడీ అని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రధాని మోడీకి చెప్పినట్టు బాబు వివరించారు. దీంతో మోడీతో బాబు భేటీ హాట్ హాట్ గానే జరిగిందని తొలిసారి బయటకు వచ్చింది. మోడీతోనే సుప్రీమ్ కోర్టుకి వెళతామని చెప్పడం ద్వారా బీజేపీ తో తెగదెంపులకు సిద్ధం అని బాబు సంకేతం ఇచ్చినట్టే.