Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రం ఎంత కవ్వించినా … మోడీ ఎంత అవమానించినా … జగన్ ఏ స్థాయిలో తిట్టినా కాస్త సంయమనం తప్పదు అంటూ సర్దుకుపోయే చంద్రబాబు పోలవరం ఎపిసోడ్ లో ఇంత దూకుడు ప్రదర్శించడం ఆయన సన్నిహితులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కసారిగా బాబులో ఇంత మార్పు ఎలా వచ్చిందబ్బా అని వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. పైకి కాస్త ఓపిక పట్టమని చెబుతూనే బాబు స్వయంగా కేంద్రం మీద దాదాపుగా యుద్ధం ప్రకటించారు. దీంతో ఇక కేంద్రాన్ని, బీజేపీ ని ఓ ఆట ఆడుకోడానికి టీడీపీ నాయకులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం ఏమిటి ? దీని వెనుక ఎవరున్నారు అని ఆరా తీస్తే ఓ ఆశ్చర్యకర విషయం తెలిసింది. బాబు వెనుక వుంది, మోడీ వెనుక లేనిది ప్రజాబలం మాత్రమే. రీసెంట్ గా జరిగిన ఓ సర్వేలో బీజేపీ మీద ఆంధ్రప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న విషయాన్ని నిర్ధారించుకున్నాక బాబు యుద్ధానికి రెడీ అయ్యారట.
టీడీపీ తరపున ఓ మాజీ రాజకీయ నాయకుడు జరిపిన సర్వే లో బీజేపీ తో పొత్తు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యిందట. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ తో కలిసి పని చేస్తే భారీ నష్టం తప్పదని ప్రజల మనోభావం గా ఉందట. బీజేపీ తో పొత్తు లేకపోతే టీడీపీ ఓటు శాతం దాదాపు పది శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఈ సర్వే అంచనా వేసిందట. బీజేపీ తో పొత్తు వల్ల వైసీపీ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయని కూడా సర్వే విశ్లేషణ చేసిందట. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా బలంగా ఉండడం అన్నిటికన్నా ముఖ్యమని చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుని ఇప్పుడు పోలవరం సమస్య ముందుకు రాగానే దాన్ని ఓ ఆయుధంగా మార్చుకున్నారట. ఓ విధంగా చెప్పాలంటే నెత్తి మీద వున్న బీజేపీ బరువుని దింపేసుకున్నారు. ఆ మోపు ఎత్తుకోడానికి జగన్ తహతహలాడుతున్నారు. ఎత్తుకున్నాక కదా బరువు తెలిసేది ?