ఈరోజు కర్నాటక సీఎం కుమారస్వామి విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వచ్చింది కనకదుర్గమ్మ దర్శనానికి అని అందరూ భావించారు. అయితే ఆయన మరో పని కూడా కలుపుకుని ఈరోజు విజయవాడ వచ్చినట్టు తెలుస్తోంది. అదే వారి కుమారుడు, జాగ్వార్ సినిమా హీరో నిఖిల్ గౌడ పెళ్లి చూపులు.
అవును తమ కుమారుడు నిఖిల్ పెళ్లి చూపుల కోసం ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బొడేపూడి శివ కోటేశ్వరరావు నివాసానికి వెళ్లారు కుమార స్వామి దంపతులు. కుమార స్వామి దంపతుల వెంట విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. తన కుమారుడు నిఖిల్ కి కోటేశ్వరరావు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలకు భావిస్తుండగా ఆమెను పెళ్లిచూపులు చూసుకునేందుకే విజయవాడకి అందునా కోటేశ్వరరావు నివాసానికి కుమారస్వామి దంపతులు వచ్చారని తెలుస్తోంది.