మోడీ దేవెగౌడని పొగిడింది అందుకేనా ?

Reason Behind Modi praising Deve Gowda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రచారం చెయ్యడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన ప్రత్యర్ధి పార్టీ అధినేత ని ప్రశంసించడం ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేవేగౌడ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఎదురువెళ్లి స్వాగతం పలుకుతానని చెప్పారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడే పరిస్థితి వస్తే బీజేపీ – జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతోంది.

దీనిపై ఇప్పటికే దేవేగౌడ స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పొగడడంతో తమకి, బీజేపీకి ‘పొత్తు’ ఉంటుందని అర్థం చేసుకోవద్దని, కన్నడ ప్రజల గౌరవాన్ని సిద్ధరామయ్య ఏ విధంగా దిగజార్చుతున్నారో చెబుతూ, ఒక కన్నడ వ్యక్తి ప్రధాని అయ్యారని మోదీ గుర్తుచేశారని ఆయన అన్నారు. అంతమాత్రన దాని అర్థం ‘పొత్తు’ ఉంటుందని కాదని పేర్కొన్నారు. అందుచేత బీజేపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తనపై ప్రశంసలు కురిపించిన మోడీకి కూడా దేవేగౌడ చురకలు అంటించారు. తనపై ప్రశంసలు కురిపించి సానుభూతి పొందాలని చూస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. నచ్చచెప్పి ఒప్పించడంలో మోడీ తర్వాతే ఎవరైనా అని అన్నారు. మోడీ నచ్చచెప్పడం వల్లే నేను ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు.

అలాగే, ఇటీవల సిద్ధరామయ్య తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా దేవెగౌడ స్పందించారు. తాను కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నానంటూ సిద్ధరామయ్య ఆరోపణలు చేశారని… మరి సిద్ధరామయ్య కొడుకు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా? అని నిలదీశారు. దానికి సిద్ధరామయ్య ఏ సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ అయితే ఇవి ఎన్నికల ముందు తమ పార్టీకి ఉన్న సాంప్రదాయ కేడర్‌, ఓట్‌బ్యాంకు చెదిరిపోకుండా ఆయన చేస్తున్న వ్యాఖ్యలే తప్ప నిజానికి బీజేపీతో అంటకాగడానికి జేడీఎస్‌ ఎపుడో తయారయ్యిందని విశ్లేషకులు అంటునారు. నిజానికి దేవెగౌడ- మోదీల మధ్య గొడవలు తరువాత లాలింపులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. దేవెగౌడను వృద్ధాశ్రమంలో చేర్పించాలని ప్రధాని మోదీ గతంలో పేర్కొన్నారు. బీజేపీతో జట్టు కడితే తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామిని పూర్తిగా వదులుకుంటానని, వాడు తన కొడుకే కాడని దేవెగౌడ కూడా రెండునెలల కిందట అనడం విశేషం..

ఎందుకంటే బీజేపీ టార్గెట్ 150 సీట్లు, కాని ఇప్పుడు అది అయ్యే పనిలా అనిపించడంలేదు. ఎందుకంటే మొత్తం 224 సీట్లకు గాను 160 సీట్లలోనే బీజేపీ- కాంగ్రస్ మధ్య పోరు ఉంటుంది. మిగిలిన చోట్ల కాంగ్రె్‌సకు తొలి ప్రత్యర్థి జేడీఎస్‌ నే కర్నాటకలో గెలుపుకు బీజేపీ 113 సీట్లు సాధించాలి. కానీ గాలీ, యడ్యురప్ప వంటి అవినీతి పరులని మైంటైన్ చేస్తున్నారన్న కారణాలతో ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవడం బీజేపీకి కష్టమే. లింగాయత్‌లకు మత హోదా, తెలుగు వారికి సైతం లేఖలు రాస్తున్న సిద్ధరామయ్యను ఎదుర్కోడానికే మోదీ – దేవెగౌడను కన్నడ భీష్ముడని అభివర్ణించారని అంటున్నారు. అటు జేడీఎస్ కూ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. ఈసారీ ఓడిపోతే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన అపఖ్యాతి మూటగట్టుకోవడమే గాక- పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమైపోయే ప్రమాదముంది. సో ఎన్నికల వరకు ఆగి ఎన్నికలయ్యాక ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేకపోతే ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని కన్నడ రాజాకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళే విమానంలో కుమారస్వామితో అమిత్ షా భేటీ కూడా ఇందుకే అని వారు ఉదాహరిస్తున్నారు.