రసజ్ఞ హత్యకు అసలు కారణం ఇదేనా..?

Reason Behind Rasagna Murder near Karimnagar Collectorate

కరీంనగర్ లో ప్రేమించలేదని ఓ యువకుడు రసజ్ఞ అనే యువతి గొంతు కోసి అనంతరం తన గొంతు కూడా కోసుకున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులకి అందిన సమాచారం మేరకు కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య మూడేళ్ళ నుండి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. నిత్యం వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో కొద్దిరోజులుగా రసజ్ఞ అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో రసజ్ఞ తన కుటుంబసభ్యులకు ప్రేమ వ్యవహారం చెప్పడంతో వారు అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. దీంతో ఇరువురు కుటుంబాల మధ్య పంచాయితీ చేశారు పెద్దలు.

పంచాయితీ సమయంలో ఇక రసజ్ఞ వెంటపడనని, ఆమెను సోదరిగా చూసుకుంటానని, ఇప్పటివరకు ఉన్న ఫొటో, మెస్సేజ్‌లను తొలగిస్తానని వంశీధర్‌ చెప్పడంతో పాటు రాతపూర్వకంగా రాసిచ్చాడు… కానీ ఆమె మీద కోపాన్ని పెంచుకున్న కొద్దిరోజులుగా తిరిగి వంశీధర్ ఆమె వెంటపడుతున్నాడు. అంతకు ముందు ఇద్దరూ కలిసి చేస్తున్న మీసేవలో మానేసి మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ ఉద్యోగంలో చేరింది. రెండు మూడు రోజులుగా మరలా ప్రేమించమని వెంటపడుతున్నాడు. శుక్రవారం కూడా ఆమె వెంటపడి వేధించడంతో రసజ్ఞ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన వంశీధర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి హతమార్చాడని తెలుస్తోంది.