తమ్మునికి రాఖీ కట్టేందుకు 8కిమీ నడిచిన 80 ఏళ్ల అక్క ప్రేమ

తమ్మునికి రాఖి కట్టేందుకు 8కిమీ నడిచిన 80 ఏళ్ల అక్క ప్రేమ
80-Year-Old Walks 8km To Tie Rakhi to Brother

చేతిలో రాఖి పట్టుకొని, ముఖం పై చిరు నవ్వులు చిందుస్తూ తన తమ్మునికి రాఖి కట్టడానికి కాలినడకన బయలుదేరింది ఒక అక్క ప్రేమ.

గురువారం రక్షా బంధన్ సందర్భంగా జగిత్యాల మలియాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల బక్కవ్వ, తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు చెప్పులు కూడా లేకుండా కాలినడకన ప్రయాణమయ్యింది.

కాగా, మహిళ యొక్క వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి విస్తృత ప్రశంసలు పొందుతుంది.

గురువారం ఉదయం పాదరక్షలు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గమనించి, ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా పండగ సందర్భంగా రాఖీ కట్టేందుకు ఈ విధంగానే తన తమ్ముడు గూడా మల్లేశం వద్దకు వెళ్తున్నానని బక్కవ్వ చెప్పింది.

రక్షా బంధన్ అనేది ప్రేమ మరియు ఆనందాల పండుగ అని, ఇది అన్నదమ్ముల బంధం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.
రాఖీ కట్టిన ప్రతి సోదరి తమ సోదరులకు మంచి ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలతో జీవించాలని ఎల్లవేళలా ఆశిస్తుంది.

తమ్మునికి రాఖి కట్టేందుకు 8కిమీ నడిచిన 80 ఏళ్ల అక్క ప్రేమ
80-Year-Old Walks 8km To Tie Rakhi to Brother