అసలు ఏమైంది? అంతా గందరగోళం

Reason Behind sridevi Dead

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అతిలోక సుందరి మరణ వార్త నిన్న ఆమె అభిమానులను తీవ్రంగా కలిచి వేసిన విషయం తెల్సిందే. ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్న అభిమానులకు మరో షాకింగ్‌ విషయం మింగుడు పడటం లేదు. ఆమె మరణం సహజ మరణం కాదని, మొదటి నుండి చెబుతూ వస్తున్నట్లుగా ఆమె హార్ట్‌ ఎటాక్‌తో చనిపోలేదు అంటూ సోషల్‌ మీడియాతో పాటు, కొన్ని మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు మరియు సినీ వర్గాల వారు అసలేం జరిగింది, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.

శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోణీ కపూర్‌ పక్కనే ఉన్నాడని, ఆమెను మొదట బాత్‌రూంలో అచేతనంగా చూసింది బోణీకపూర్‌ అంటూ నిన్న మొత్తం ప్రచారం జరిగింది. కాని తాజాగా మాత్రం బోణీకపూర్‌ ఆ సమయంలో ఇండియాలో ఉన్నారని, హాస్టల్‌ సిబ్బంది ఆమె మృతదేహంను గుర్తించారు అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఆమెది సహజ మరణం కానందువల్లే దుబాయి ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఈ విషయాన్ని పరిగణించి, ఆమెకు సుదీర్ఘ పోస్ట్‌ మార్టంను నిర్వహించారని, ఆమె బస చేసిన హోటల్‌ గదిని సీజ్‌ చేయడంతో పాటు, మొత్తం సూట్‌ను పోలీసులు కంట్రోల్‌లోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి శ్రీదేవి మరణ వార్తతో క్రుంగిపోయిన అభిమానులకు ఆమెది సహజ మరణం కాదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింతగా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది, ఇండియన్‌ ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయాల గురించి కొందరు చర్చించుకుంటున్నారు.