జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిస్మస్ పర్యటన కోసం యూరప్ వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా విజయవాడ వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అక్కడ ఆయనను కలిసిన పార్టీ నాయకులు, మీడియా కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆయన ఆహార్యాన్ని చూసి…ఆయన ఒక ఓ తాయత్తును మెడలో వేసుకుని మీడియా ముందుకు వచ్చారు. పవన్ మెడలో ఆ తావీజును చూసి చాలా మంది యూరప్ చర్చిల్లో కూడా ఇలాంటి తావీజులు కడతారా..? అని ఆలోచించడం మొదలుపెట్టారు.
వాస్తవానికి పిల్లలకు దిష్టి పోవడానికి లేకపోతే జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి ఇలాంటి తాయెత్తులు కడుతూ ఉంటారు. అలాంటిదే పవన్ కల్యాణ్ ధరించారు. నిజానికి పవన్ కల్యాణ్ కు నమ్మకాలు ఎక్కువే. ఆయన మూడో భార్య క్రిస్టియన్ అయినప్పటికీ పవన్ కల్యాణ్ హిందూ దేవతల్ని అభిమానిస్తారు. ప్రత్యేకంగా యజ్ఞాలు కూడా చేస్తారని గతంలో కత్తి మహేష్ లాంటి వాళ్ళు బహిర్గతం చేశారు. అలాగే తన బిడ్డ పుట్టు వెంట్రుకలను తిరుమలలో ఇచ్చారు. దేవుళ్ళ మీద ఉన్న నమ్మకాల ప్రకారమే పవన్ కల్యాణ్ ఇప్పుడు తావీజు పెట్టుకుని పెట్టుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా దర్గాల దగ్గర ఇలాంటి తాయెత్తులు కడుతూంటారు. దుష్టశక్తులు దగ్గరకు రాకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు. మరి ఆయన తాయత్తు దేనికో ?