భారీగా ‘ఎన్టీఆర్‌’ ఓవర్సీస్‌ హక్కులు…!

NTR Biopic PRe Release Event

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ప్రస్థానంను ఏర్పరుచుకున్న నందమూరి తారక రామారావు బయోపిక్‌పై సినీ, రాజకీయ ప్రముఖులకు సైతం ఆసక్తి నెలకొటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలక్రిష్ణ నటిస్తున్నాడు.

NTR Biopic Part 2 Mahanayakudu Is Likely To Postpone

హరిక్రిష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ కనిపించనుండగా శ్రీదేవిగా రకుల్‌, జయప్రదగా తమన్నాలు కనిపించనున్నారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ తార విద్యాబాలన్‌ నటిస్తోంది. ఈచిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుకగా మొదటి పార్టును, రిపబ్లిక్‌ డే సందర్భంగా రెండో పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టారు. ఈ చిత్రంలోని పలువురి ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసి అంచనాలను పెంచుతున్నారు.

ntr-bio-pic

తాజాగా ‘ఎన్టీఆర్‌’ ఓవర్సీస్‌ హక్కులు భారీ రేటుకు అమ్ముడయినట్టు సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ 20కోట్లను వెచ్చించి ఓవర్సీస్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ అంటే ఓవర్సీస్‌ ప్రేక్షకులకు చాలా అభిమానం ఉంది అందుకే భారీ మొత్తాన్ని వెచ్చించడానికైనా సదరు సంప్థ వెనకడుగు వేయలేదు. అంతేకాకుండా ఓవర్సీస్‌లో క్రిష్‌కు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. దాంతో ఈ చిత్రంపై ఓవర్సీస్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ntr-biopic-movie

అందుకే భారీ రేటుకు ‘ఎన్టీఆర్‌’ హక్కులు అమ్ముడుపోయాయి. ఇంత మొత్తాన్ని వెచ్చించిన సదరు సంస్థకు రికవరీ అవాలంటే కచ్చితంగా ఈ చిత్ర రెండు పార్టులు కూడా సక్సెస్‌ కావాలి. రెండిరటిలో ఏ ఒక్కటి తప్పినా నష్టాలే. కానీ ‘ఎన్టీఆర్‌’ పై ఉన్న ఆసక్తి వల్ల రెండు పార్టులు కూడా సక్సెస్‌ అవొచ్చు అనే టాక్‌ వినిపిస్తోంది.

ntr-bio-pic