రికార్డ్‌ సేల్‌

రికార్డ్‌ సేల్‌

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అమెజాన్ 750 కోట్ల రూపాయల విలువైన స్మార్ట్‌ ఫోన్‌లను విక్రయించి రికార్డ్‌ సేల్‌ను సాదించింది.మొదటి రోజనే రెండు రెట్లు అధికంగా వృద్ధిని ఫ్లిప్‌కార్ట్ పొందింది. వన్‌ ప్లస్, శాంసంగ్,యాపిల్‌ వంటి ప్రీమియం బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలపైన 750 కోట్ల రూపాయాలని 36 గంటల్లో అమెజాన్‌ సాదించినట్టు అమెజాన్‌ కంట్రీ హెడ్ అమిత్అగర్వాల్ తెలిపారు.ఇంకా 5రెట్ల వృద్ధినీ ఫ్యాషన్‌ రంగంలో,7రెట్ల వృద్ధిని గ్రాసరీస్విభాగంలో సాదించారు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే స్థాయిలో గత ఏడాది కన్నా రెండురెట్లు ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ​ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఫ్యాషన్‌,బ్యూటీ ఫర్నిచర్‌ అమ్మకాలు బాగా జరిగాయని మొబైల్స్‌, ల్యాప్ టాప్ లు ఇతర ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలు రెండో రోజు అధికంగా ఉన్నాయని చెప్పారు.