Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దెబ్బ మీద దెబ్బ, ఎదురు దెబ్బ, వరసగా ఎదురు దెబ్బలు …ఇలా ఎన్ని జరుగుతున్నా వైసీపీ అధినేత ఆలోచనల్లో కాసింత మార్పు రాలేదు. వ్యవహారశైలిలో కొంచెం అయినా మార్పులు,చేర్పులు లేవు. పైగా కాలం గడిచే కొద్దీ పరాజయాల నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోకపోగా అనుమానాలు, అభద్రతా భావం పెంచుకుంటున్నారు. అందుకే పార్టీలో సొంత కులం తప్ప ఇంకో కులం నాయకుల మీద ఏ మాత్రం నమ్మకం పెట్టలేకపోతున్నారు . వైసీపీ లో రెడ్ల ఆధిపత్యం కొనసాగుతుందన్నది బహిరంగ రహస్యమే కానీ ఇంకో కులం వారికి కనీస గుర్తింపు కూడా ఉండదని జగన్ స్వయంగా నిరూపించారు.
2019 ఎన్నికల కోసం వ్యూహాలు రూపొందించేందుకు వైసీపీ అధినేత జగన్ ఓ బృందాన్ని రూపొందించారు. ఈ బృందం పని జిల్లాలావారీగా పార్టీ వ్యూహాలు తయారు చేయడం. ఈ వ్యూహకర్తల బృందంలో మొత్తం 10 మంది ఉంటే అందులో 9 మంది రెడ్డి కులస్తులే. ఇక ఆ బృందంలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క రెడ్డియేతర నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రమే.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి- కృష్ణా జిల్లా
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి – అనంతపురం జిల్లా
మేకపాటి రాజమోహనరెడ్డి- ?
మేకపాటి గౌతమ్ రెడ్డి – కర్నూల్ జిల్లా
విజయసాయి రెడ్డి – చిత్తూరు,విశాఖ జిల్లాలు
సజ్జల రామకృష్ణారెడ్డి – నెల్లూరు ,ప్రకాశం జిల్లాలు
వై.వి .సుబ్బారెడ్డి – ఉభయ గోదావరి జిల్లాలు
భూమన కరుణాకర్ రెడ్డి – శ్రీకాకుళం, విజయనగరం
వై.ఎస్ . వివేకానందరెడ్డి – కడప
బొత్స సత్యనారాయణ – గుంటూరు .
ఇదండీ బీసీ, ఎస్సీ ,మైనారిటీలకు తామే అసలుసిసలు ప్రతినిధులం అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ తయారుచేసుకున్న వ్యూహకర్తల బృందం. ఎన్నికల ముందు ,ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న వ్యూహకర్తల బృందం తయారీలో కనీసం చూసే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న స్పృహ కూడా లేకుండా 90 శాతం సొంత కులానికి చెందిన నేతలు, అందులోను బంధుగణం తో నింపిన జగన్ కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందంటారా ? . మొత్తం తన కులస్తులకే పెద్ద పీట వేసి జగన్ ఇంకా కొత్తగా సాధించేది ఏమైనా వుందా? . ఇతర కులాల మీద చిన్నచూపు, అపనమ్మకం బయటపెట్టుకోవడం తప్ప. ఓసీల్లో తన కులానికే పట్టం కట్ట్టుకుంటే ఓకే గానీ మిగిలిన వర్గాల్లో ఒక్కరికి కూడా స్థానం లేకుండా చేయడం చూస్తుంటే పక్క కులాల తెలివితేటల మీద జగన్ కి ఎంత నమ్మకం వుందో అర్ధం అవుతూనే వుంది.