రెడ్డి సిస్టర్స్…ఒకరు కాంట్రవర్శీ కా బాప్ శ్రీరెడ్డి అయితే…మరొకరు కాంట్రవర్శీలకి కేరాఫ్ శ్వేతా రెడ్డి. ఈ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో దర్శనం ఇచ్చారు. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చి ఇండస్ట్రీ జానినికి కంటిపై కునుకు లేకుండా చేసిన శ్రీరెడ్డి.. తరచూ సెక్సువల్ హరాస్మెంట్పై తన వాయిస్‌ని వినిపిస్తూనే ఉంది.
ఇక యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసి యూట్యూబ్ సంచలనంగా మారిన శ్వేతారెడ్డి.. గత ఎన్నికల్లో కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనంగా మారింది.
గాయిత్రి గుప్తాతో కలిసి ఢిల్లీ స్థాయిలో బిగ్ బాస్ షోపై నిరసన తెలిపింది. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఈ షోను నిలిపివేయాలని నిర్వహకులపై కేసులే వేసే వరకూ వెళ్లింది శ్వేతారెడ్డి. అటు శ్రీరెడ్డి.. ఇటు శ్వేతారెడ్డి మార్గం ఒకటే కావడంతో ఈ ఇద్దరూ జతకలిశారు. ‘లైంగిక వేధింపులకు మేము ఎప్పుడూ మద్దతు ఇవ్వము.. అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్కతీస్తారు కొడుకులది’ అంటూ ఘాటైన పోస్ట్ వదిలారు ఈ రెడ్డి సిస్టర్స్.