మరో రూ.200 సబ్సీడీ ఉజ్వల స్కీమ్ కింద ఒక్కో సిలిండర్ పై అదనంగా అందించనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 01 నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో రూ.200 సబ్సీడీ ఉజ్వల స్కీమ్ కింద ఒక్కో సిలిండర్ పై అదంగా చెల్లించనున్నట్టు తెలిపారు.
కేంద్రం వంటగ్యాస్ ధరలు రూ. 200 మేర తగ్గించడంతో ఏపీలో సిలిండర్ ధరలు రూ. 915కు చేరింది. అటు తెలంగాణలోని హైదరాబాదులో రూ. 955గా ఉంది. ఉజ్వల కనెక్షన్ అయితే మరో రూ.200 తక్కువకే సిలిండర్ వస్తుంది. తగ్గింపు ధరలు నేటి నుంచి అమలు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 40 సబ్సిడీ వస్తోంది. రెండు, మూడు రోజుల్లో తర్వాత ఎంత సబ్సిడీ ఉంటుందనే దానిపై క్లారిటీ రానుంది.