సచిన్ తో తనకు ఉన్న అనుబందం : రోహిత్ శర్మ

సచిన్ తో తనకు ఉన్న అనుబందం : రోహిత్ శర్మ

భారతదేశం లో క్రికెట్ అని అనగానే మన అందరికీ గుర్తు వచ్చే పేరు సచిన్ టెండూల్కర్, ఇప్పటివరకు ఆటలో ఫేమస్ అయిన వారిని మనం చాలామందిని చూసాం. అయితే క్రికెట్ నే భారత్ లో ఫేమస్ అయ్యేలా చేసిన క్రికెటర్ ఎవరంటే అందరు సచిన్ అనే అంటారు. భారత్ తరపున దాదాపు 24 ఏళ్లు క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించిన ఘనత సచిన్ దే. 200 టెస్ట్ మ్యాచ్ లు, 463 వన్డే లు, అత్యధిక పరుగులు, వంద సెంచరీలు ఇలా ఎన్నో ఘనతలు సాధించిన సచిన పుట్టిన రోజు నేడు. అయితే క్రికెట్ అభిమానులు, హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల, అందరూ ఈరోజు సచిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ సందర్భంలో రోహిత్ శర్మ సచిన్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఒక అయిదు బెస్ట్ మూమెంట్స్ ద్వారా తెలిపారు. తన అభిమానులతో ఆ అయిదు బెస్ట్ మూమెంట్స్ ను పంచుకున్నారు.

ఒక గొప్ప వ్యక్తి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రోహిత్ తెలిపారు. అయితే అయిదు బెస్ట్ మూమెంట్స్ ఇవే అంటూ వ్యాఖ్యానించారు. మొదటగా సిడ్నీ లో ఆస్ట్రేలియా తో ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ భాగస్వామ్యాన్ని పంచుకోవడం అని అన్నారు. రెండవది ఈడెన్ గార్డెన్స్ వద్ద టెస్ట్ క్యాప్ ను అందుకోవడం అని అన్నారు. మూడవది ఐపీఎల్ టీ 20 మరియు సి ఎల్ టీ 20 ముంబై ఇండియన్స్ తో గెలవడం అని వ్యాఖ్యానించారు. నాల్గవది టెస్ట్ చివరి మ్యాచ్ క్షణాలు 199 మరియు 200 టెస్ట్ మ్యాచ్ లను సచిన్ తో పంచుకోవడం. అయిదవది తన 100 వ సెంచరీ ను మైదానం లో ఉండి చూడటం. రోహిత్ శర్మ పంచుకున్న ఈ బెస్ట్ మూమెంట్స్ పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.