కీరవాణి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రామ్ గోపాల్ వర్మ

కీరవాణి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రామ్ గోపాల్ వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కరోనా వైరస్ మహమ్మారి గురించి రకరకాల పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఒక పాటను కూడా పాడి విడుదల చేశారు. అయితే రోజురోజుకీ పెరుగుతున్న కోరిన వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ మరియు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ల మధ్య ఒక ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

తాజాగా సంగీత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావిస్తూ 1988 లో రామ్ గోపాల్ వర్మ ఒక పుస్తకాల పురుగు అని నాకు తెలుసు.కానీ ఇపుడు ఆయన కరోనా పురుగు గురించి తెలుసుకొనే విషయంలో బిజీ గా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరించారు. సర్ మీరు ఇప్పటికీ స్టీఫెన్ హాకింగ్ నవలలు చదువుతున్నారా అని వ్యాఖ్యానించారు. అయితే రామ్ గోపాల్ వర్మ కీరవాణి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా ప్రజల జీవితాలు పై ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిని తనదైన శైలిలో వివరించారు వర్మ. నేను ఆయన రచనలను చదవడం లేదు సార్ అని వ్యాఖ్యానించారు.ఆయన రాసిన కల్పిత కథల కంటే మన నిజ జీవితం చాలా భయంకరంగా ఉంది అని అన్నారు రామ్ గోపాల్ వర్మ.