ఈనెల 21న వేములవాడలోని సుబ్రమణ్యనగర్‌లో పట్టపగలే నాగుల రవి(32)ను కత్తులతో నరికి చంపిన ఘటనలో వేములవాడకు చెందిన అక్రమ్, అహ్మద్, జావిద్‌లను అరెస్టు చేసినట్లు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. రూరల్ సీఐ కార్యాలయంలో నిన్న హత్యకు సంబందించిన వివరాలను ప్రెస్ కి తెలిపారు. పదేళ్ల క్రితం నుంచే రవి, షకీరాల మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని, పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిందని, అనంతరం షకీరాకు పెళ్లి చేయడంతో ఇద్దరు పిల్లలు పుట్టారని అన్నారు. అయితే ఆమె భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లగా అత్తగారింటిలో ఉంటున్న షకీరా వేములవాడకు వచ్చేసింది. ఈ క్రమంలో రవి షకీరాను నిత్యం వేధింపులకు గురి చేయడంతో తమ సోదరులకు బాధ చెప్పుకుంది. రవిని చంపేస్తే తప్ప నాకు విముక్తి లభించదని సోదరి చెప్పడంతో ముగ్గురు సోదరులు అక్రమ్, అహ్మద్, జావిద్‌కు రవిని చంపేందుకు సిద్ధపడ్డారన్నారు. ఈ క్రమంలో వీరి మేనబావలైన ఇంతియాజ్, రియాజ్‌లతోపాటు స్నేహితులైన సోమినేని వేణు, మండలోజు సందీప్, గుండా బాలులను సైతం సంప్రదించారు. ఈక్రమంలో వీరంతా రవిని చంపేయాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని ఒప్పుకున్నారని ఇందుకు బాలు, వేణు, సందీప్‌లకు రవి మూమెంట్స్ తమకు తెలియజేయాలని ముగ్గురు సోదరులు కోరగా అప్పట్నుంచి ఈ ముగ్గురు స్నేహితులు రవి మూమెంట్స్‌ను గమనిస్తూ హత్య ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అలా ప్లాన్ చేసి బైక్‌పై ఉన్న రవిని నరికి చంపేశారని తెలిపారు.