ఫేక్‌కాల్ చేసిన యువకుడికి రిమాండ్

Remand to young man for a fake call

చెన్నై వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ ఫేక్‌కాల్‌చేసిన నిందితున్ని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్టు ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్జీఐఏ) సీఐ రామకృష్ణ చెప్పారు. ఈ నెల ఆరు ఉదయం 6.40 గంటలకు శంషాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో ట్రూ జెట్ విమానంలో బాంబుఉందని ఫేక్‌కాల్‌చేసిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన కేవీ విశ్వనాథన్‌గా (24) గుర్తించినట్టు తెలిపారు. సికింద్రాబాద్‌లోని గ్లోబ్ లింక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో అతడు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. చెన్నై వెళ్లేందుకు అతడు ఆరోతేదీ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడని, ప్రేమలో విఫలమై మద్యం మత్తులో ఉన్న నిందితుడు విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఫేక్ సమాచారం ఇచ్చినట్టు తమ విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు.