భర్త కాదురా బాబు, బ్రదర్ !

Renu Desai Brother’s Wedding Pic Viral On Social Media

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారు. ఇందులోభాగంగా, ఆమెకు ఆదివారం నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. వీటిని నిజం చేసేలా ఓ నిశ్చితార్థం ఫోటో ఆదివారం నాడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇపుడు ఏకంగా ఆమె నిశ్చితార్థం చేసుకున్న వరుడు ఫోటో కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు జనాలు అంతా అదే ఫోటోను షేర్ చేస్తున్నారు. ఆమె భర్త అతనే అంటూ !

అయితే కాస్త లోతుగా పరిశీలిస్తే తేలిన విషమేమిటంటే రేను దేశాయ్ భర్త ఇతనే అంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్నవి ఫేక్ ఫోటోలు , ఇంకో ఘోరమైన విషయమేమిటంటే ఆయన రేణు సోదరుడు, మూడేళ్ళ క్రితం ఆయన వివాహ సమయంలో రేణు ఆయనతో ఫోటోలు దిగగా వాటిని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా ప్రబుద్దులు. సోదరుడితో ఉన్న ఫోటోలు పెట్టి వైరల్ చేస్తుంటే ఆ ఆడ మనసు ఎంత గాయపడుతుందో ఈ ప్రబుద్దులకి ఏమి తెలుసు, బతికున్న వాజపేయి లాంటి వారినే శ్రద్దాంజలి ఘటించే వీరులున్నారు మన సోషల్ మీడియాలో. ఈ విషయం మీద ఆయన నా కాబోయే భర్త కాదురా బాబు, బ్రదర్ అని రేణు స్పష్టత ఇస్తే తప్ప ఈ ఫోటోల షేరింగ్ కి అంతు ఉండదు !!

అయితే తనకు కాబోయే భర్త ఎవర్న విషయాన్ని రేణు ఇప్పటి వరకు ఎక్కడా వెల్లడించలేదు. రేణూ రెండో పెళ్లికి కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు పెళ్లి చేసుకోవద్దంటూ కోరుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ తమ తమ సందేశాలను రేణుకు పంపిస్తున్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో వివాహంపై ఆమె మాజీ భర్త, నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రేణు రెండో పెళ్లికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ట్వీట్టర్‌ ద్వారా స్పందించిన పవన్.. ‘‘కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రకృతి తనకు సమృద్ధియైన ఆయురారోగ్యాలు, ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.